prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 11:11 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వైసీపీ నుంచి బిజెపి పార్టీలో 30 కుటుంబాలు చేరిక *దేశ సంక్షేమం, ధర్మ సంరక్షణ బీజేపీ కే సాధ్యం.*

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24)కాశినాయన మండలం బసనపల్లె గ్రామంలో సావిశెట్టిపల్లె, బసనపల్లె ఆకులనారాయణపల్లె, వరికుంట్ల, గంగనపల్లె గ్రామాల నుండి 30 కుటుంబాలు బిజెపి కాశినాయన మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణ రెడ్డి,భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి,బిజెపి మండల ఉపాధ్యక్షుడు ఎదురు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు . జిల్లా అధ్యక్షులు వెంకటసుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మన ఊరు _ మనకు జెండా కార్యక్రమంలో భాగంగా బసనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బిజెపి జెండానా ఆవిష్కరించారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. బిజెపిమండల నాయకులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి,నారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు తామంతా కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామ పంచాయతీలో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపి గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను బిజెపి బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని నూతనంగా చేరిన కుటుంబాల సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మీనారాయణ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మల్లికార్జున్రెడ్డి మల్లికార్జున రెడ్డి, ఓబీసీ మండలాధ్యక్షుడు తోడేటి మునీంద్ర యాదవ్, భాస్కరరెడ్డి,నాగార్జునరెడ్డి,ఎదురు శిరీష, షేక్ పీరావలి,ప్రతాపరెడ్డి, పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.