వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నీ కలిసిన కాగజ్ ఘర్ రిజ్వాన్
అనంత పురం బ్యూరో జూలై 21 మన ప్రజా వాణి
ఈ రోజు తాడేపల్లి లోని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్ ఘర్ రిజ్వాన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా అయన కూటమి ప్రభుత్వం మైనారిటీల మీద జరుగుతున్న దాడులు అరాచకాలు గురుంచి వివరించడం జరిగింది. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మైనారిటీ లను సంక్షేమ పథకాలలో కూడా ఎంత మోసం చేస్తోందో వివరించడం జరిగింది.జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్ ఘర్ రిజ్వాన్ తో పాటు రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసుల్ ఆజమ్, నెల్లూరు జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీరా బాషా , రాష్ట్ర మాజీ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ నిజాం , గుడివాడ మైనారిటీ నాయకులు సయ్యాద్ తదితరులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన వారిలో ఉన్నారు.