వైయస్సార్ విగ్రహానికి దక్కని గౌరవం: పట్టించుకోని నేతలు, వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి

పోరుమామిళ్ల:జూలై 13 ప్రజావాణి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్సార్సీపీ కంచుకోటగా పేరుగాంచిన బద్వేల్ నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి తీవ్ర అవమానం జరుగుతోంది. పోరుమామిళ్ల మండలంలోని టేకురుపేట పంచాయితీ పరిధిలో ఉన్నతిరువెంగళపురం మెయిన్ రోడ్డు వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహం ప్రస్తుతం ఎలాంటి రక్షణ లేక,పీఠంపై కాకుండా నేలపై దిక్కులేని స్థితిలో పడి ఉంది. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ,వైఎస్సార్ విగ్రహం ఇలా రోడ్డు పక్కన పిచ్చిమొక్కల మధ్య...