prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 3:25 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వైద్య వృత్తి పవిత్రమైనది- ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి.

వైద్య వృత్తి పవిత్రమైనది- ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి.

వైద్య వృత్తి పవిత్రమైనదని, ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని వైద్యాధికారులు అన్నారు. బద్వేల్ పట్టణంలోని తొట్టిగారి పల్లెలో గురువారం వైద్య అధికారి జే వినయ్ కుమార్ అభినంద సభ, తొట్టిగారి పల్లె వైద్యాధికారి రాజేష్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోటవీదీ యూపిహెచ్సి వైద్యాధికారి సౌమ్య మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలు వినయ్ కుమార్ వైద్యాధికారిగా మండలంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కరోనా సమయంలో కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలలో విష జ్వరాలను అదుపు చేసి, ప్రజలలో శుభ్రత, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వారికి అవగాహనపరచడం జరిగింది. సురేంద్రనగర్ యూ పి హెచ్ సి వైద్యాధికార

శ్రీనివాసులు, గాంధీనగర్ యు పి హెచ్ సి వైద్యాధికారి శరత్ చంద్ర మాట్లాడుతూ, వైద్యాధికారి వినయ్ కుమార్ పిహెచ్సి కి చేసిన సేవలను కొనియాడారు .ఉన్నత చదువులకు పోయి భవిష్యత్తులో ప్రమోషన్లు పొందాలన్నారు. అనంతరం వైద్య అధికారులు, మలేరియా సబ్ యూనిట్ అధికారులు నరసింహారెడ్డి, సుబ్బరాయుడు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ అధికారి వెంగయ్య, సిహెచ్ఓ చంద్రావతి, టిబి సూపర్వైజర్ ప్రసాద్ ,సిహెచ్ ఓ మురళి, శంభు ప్రసాద్, హెల్త్ అసిస్టెంట్లు జనార్దన్ రావు, శ్రీరాములు, కాసిం వైద్య సిబ్బందులు, వైద్య అధికారి వినయ్ కుమార్ చేసిన సేవలను కొనియాడుతూ, పూలమాలలు ,శాలువాలతో ఘనంగా సన్మానించారు.