prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 3:39 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా బీసీ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా భీముడు..

బద్వేల్ (మే18 ప్రజావాణి) బీసీ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని తొట్టి గారి పల్లె గ్రామానికి చెందిన ప్రబల వీటి కరిముల్లా (భీముడు) నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి,బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మున్సిపల్ మాజీ చైర్మన్ వాకమళ్ల రాజగోపాల్ రెడ్డి మరియు పలువురు ముఖ్య నాయకుల సహకారంతో భీముడుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.​కడప జిల్లా బీసీ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమితులైన భీముడు సోమవారం బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా భీముడు మాట్లాడుతూ.వైఎస్సార్సీపీలో తాము చేసిన సేవలను గుర్తించి, ఈ పదవిని అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మరియు ఇతర సీనియర్ నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు