వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శిగా చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి
ప్రజావాణిన్యూస్(మార్చి15)పోరుమామిళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శిగా చాపాటి లక్ష్మీనారాయణరెడ్డి గారు నియమితులైన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా గజమాలతో,శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ,తనకు ఈ కీలక బాధ్యత లభించడంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారి ప్రోత్సాహం,మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిందని తెలిపారు.పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలకు దారిదీపంగా నిలుస్తున్న ఆయన నాయకత్వం తమకు ఎల్లప్పుడూ...