prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 4:25 am Digital Edition : PRAJA VANI

*వేసవి సెలవుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*

*తాళం వేసిన ఇండ్లపై దొంగల గురి ఎక్కువ*

*మన సమగ్ర ప్రజావాణి ఏప్రిల్ 22  అందోల్ జోగిపేట్*

*వేసవి సెలవుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*

*తాళం వేసిన ఇండ్లపై దొంగల గురి ఎక్కువ*

*మన సమగ్ర ప్రజావాణి ఏప్రిల్ 22  అందోల్ జోగిపేట్*

వేసవి సెలవుల్లో అన్ని స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో అందరూ తమ సొంత ఊర్లకు వెళుతూ ఉంటారు. ఇదే అదునుగా చూసుకొని దొంగలు దొంగతనం చేయడానికి వేచి చూస్తూ ఉంటారు. కానీ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండ్లలో ఉన్న బంగారం కానీ డబ్బులు కానీ బ్యాంకు లాకర్లో కానీ తమ వెంట తీసుకు వెళ్ళడం మంచిది.అలాగే తాళం వేసి వెళ్లేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పి వెళ్లడం మంచిది. తాళం వేసి వెళ్లేటప్పుడు ఇంట్లో లైట్లు వేయాలి అలాగే చెప్పులు బయట వదలాలి. ఇలా చేయడం వల్ల దొంగలు కూడా ఎవరో ఉన్నారని భావిస్తారు. పేపర్ బాయ్ పాలు పోసే వారికి ముందుగానే తెలియజేయాలి. మహిళలు ఒంటరిగా వెళ్లేటప్పుడు చుట్టుపక్కల గమనిస్తూ వెళ్లాలి. పెళ్లిళ్లకు టూర్లకు వెళ్లేవారు. జాగ్రత్తగా ఉండాలి. బయట నిద్రించే  వారు ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరైనా అనుమాన స్థితిలో తిరిగితే వెంటనే 100 నెంబర్ కి డయల్ చేయాలని జోగిపేట సీఐ తెలియజేశారు.