prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 2:02 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వేసవి సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు -విద్యారంగంలో విద్యా దీపం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరిమళ జ్యోతి


కాశినాయన,మే19 ప్రజావాణి ఒకవైపు ఎండలు మండుతున్నాయి. బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు బాలలు పగటి ఉష్ణోగ్రతలు తట్టుకోలేక చెరువులు జలాశయాలు వద్దకు వెళ్లి ప్రాణాలు మీదికి తెచ్చుకొనే పరిస్థితులు ఉన్నవి.ఇలాంటి పరిస్థితులలో ఎండైనా, అలసటైనా మా ప్రయాణం విద్యార్థుల భవిష్యత్తు కోసమే అంటూ కాశి నాయన మండలంలోని రెడ్డి కొట్టాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బండి పరిమళ జ్యోతి హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి సెలవులు వృధా కాకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనే సంకల్పంతో వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. రెడ్డి కొట్టాల పాఠశాలలో జరుగుతున్న ప్రత్యేక తరగతులకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభిస్తున్నది. ఈ వేసవి విజ్ఞాన తరగతులకు సుమారు 50 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక తరగతుల్లో డ్రాయింగ్ పేపర్ క్రాఫ్ట్ ఐటమ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ బోధిస్తున్నారు. విద్యార్థులు చాలా క్రియాత్మకంగా పాల్గొంటున్నారు.ఈరోజు హరిత ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ అయినటువంటి డాక్టర్ కాటూరు ఫణి రాజ కుమార్ సహకారంతో బండి పరిమళ జ్యోతి విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు తోడ్పడే5000 రూపాయల విలువ చేసే డ్రాయింగ్ పుస్తకాలు ,కలర్ పెన్సిల్స్ 50 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరిమళ జ్యోతి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా హరిత ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఫణి రాజ కుమార్ పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని, హరిత ఫౌండేషన్ సేవలు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు డాక్టర్ ఫణి రాజ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.