వేంపల్లి ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ అరికట్టాలి ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్రప్రసాద్
ప్రజావాణి న్యూస్: (మార్చి08) కడప జిల్లా వేంపల్లిలో జరుగుతున్న ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ను అరికట్టాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం కడప నగరంలోని స్థానిక కాగితాల పెంటలోని ఏ.ఐ.ఎస్.బి కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ,కడప జిల్లా వేంపల్లి ప్రాంతంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాలు కుమ్మక్కు అయి ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షా కేంద్రాలలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగేలా...