prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 7:54 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

వెల్గటూర్ మండల RMP, PMP కార్యవర్గ ఏకగ్రీవ ఎన్నిక

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల RMP, PMP అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు కుసుమ శంకర్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలో అధ్యక్షునిగా సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చట్టుపల్లి గంగాధర్, కోశాధికారిగా మోకెనపల్లి సతీష్ నియామకమయ్యారు. గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి, సంఘ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని నూతన నాయకులు తెలిపారు. అనంతరం వారికి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.