prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 2:22 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వెన్నుపోటుకు రెండేళ్లు.బద్వేల్ గర్జన ,,అబద్ధాల పాలనకు వ్యతిరేకంగా బద్వేల్ గడ్డపై వైఎస్సార్‌సీపీ పోరుబాట

బద్వేల్ జూన్ 5 ప్రజావాణి ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి,మాటలతో మభ్యపెట్టి చేతల్లో మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిపై బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాగ్రహం ఉప్పొంగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” బద్వేల్ నియోజకవర్గంలో భారీ నిరసన కార్యక్రమం బద్వేల్ మున్సిపాలిటీ,బద్వేల్,అట్లూరు,గోపవరం మండలాలకు సంబంధించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా,బద్వేల్ టౌన్ ఎన్జీవో కాలనీ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ  చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ మేనిఫెస్టో ప్రతులను చించి నిరసన వ్యక్తం చేశారు.హామీలన్నీ గాలిలో. ప్రజల ఆశలు అడియాశలు “సూపర్-6” పేరుతో ఇచ్చిన హామీలు రెండేళ్లు పూర్తయినా అమలు కాలేదని,ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చి ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించారని నాయకులు విమర్శించారు. నిరుద్యోగ యువతకు మోసం ప్రతి ఇంటికి ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.మహిళలకు మాటలు మాత్రమే.. చేతల్లో శూన్యం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పినా అమలు కాలేదని, మహిళా సంక్షేమంపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.రైతన్నకు భరోసా కరువు యూరియా కొరత, ఎరువుల ధరల పెరుగుదల,గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతు భరోసా హామీలు కూడా నెరవేరలేదని తెలిపారు. పెన్షన్లు – ఇళ్లు –సంక్షేమం అన్నీ నిరీక్షణలోనేకొత్త పెన్షన్లు,కొత్త ఇళ్లు, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.విద్య –వైద్యం–ఉద్యోగాల్లో వైఫల్యం ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు సక్రమంగా అందడం లేదని,మెగా డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీల్లో అన్యాయం జరిగిందని ఆరోపించారు.జగన్ పాలనలో మహిళలే మహారాణులు చేయూత, ఆసరా, సున్నా వడ్డీ రుణాలు,గృహ హక్కులు,మహిళా సాధికారత కార్యక్రమాలతో జగన్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు అయ్యే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది.రాష్ట్ర మరియు జిల్లా మరియు మండలం మరియు అనుబంధ విభాగాల నాయకులు,పలు ప్రజాప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులు మహిళలు,యువత,రైతులు,కార్యకర్తలు,అభిమానులతో కలిసి నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.