వెంకటాపురంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం

ఘాట్ కేసర్, మే 3 ( ప్రజావాణి): మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని, పోచారం వార్డులో వెంకటాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో భక్తుల నినాదాలతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. స్వామివారి రథాన్ని గ్రామ వీధుల గుండా ఊరేగించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం టీఆర్‌ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు నవీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అలాగే ఆలయ చైర్మన్ సత్తయ్య...