వృద్ధ దంపతుల ఘటనలో మహిళ రవిక (జాకెట్) చింపినట్లు, ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం – మైదుకూరు డి.ఎస్.పి.రాజేంద్ర ప్రసాద్.

కడప జిల్లా బద్వేలు (జులై 20ప్రజావాణి) పట్టణంలోని మార్తోమా నగర్‌లో ఉన్న 3 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించి బద్వేలుకు చెందిన పిన్నం వెంకటయ్య మరియు ప్రొద్దుటూరుకు చెందిన అయ్యవారమ్మ తదితరుల మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది.ఈ క్రమంలో,18.07.2026 తేదీ సాయంత్రం పిన్నం వెంకటయ్యకు మరియు సదరు స్థలాన్ని అయ్యవారమ్మ వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పబడుతున్న కడపకు చెందిన బొజ్జా తిరుమలేష్ తదితరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.సంఘటన సమాచారం అందుకున్న వెంటనే బద్వేలు టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి...