వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ ఏప్రిల్ 19 👉🏼పోరుమామిళ్లలో రోడ్డు వెడల్పు కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉదార స్వభావంతో 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పనులు ఎన్నో ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైనప్పటికీ వేసిన రోడ్డుకు ఇరువైపులా చిల్లర బండ్ల వ్యాపారులు, మోటార్ బైకులు, ప్లెక్సీలు, ఆటోలు, కార్లు, అన్ని ఆక్రమించుకొనడంతో కేవలం సింగిల్ రోడ్డు గా తయారైంది. ఈ విషయాన్ని పోరుమామిళ్లలో పోలీసులు ప్రతినిత్యం చూస్తూనే ఉంటారు. కానీ వారు మాత్రం ఎవరికీ చెడ్డ కారు. ఎవరిని ఏమీ అనరు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు బూట్లు చప్పుడు చేసుకుంటూ రావడం తప్ప వారు చేసే ఘనకార్యం ఏమీ లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.అంబేద్కర్ సర్కిల్ నుంచి పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్డును వెడల్పు చేసి ఇరువైపులా డ్రైనేజీ కాలువ కూడా నిర్మాణం పనులు చేస్తున్నారు. నిర్మాణం పనులు అయిపోయినచోట షాపుల యజమానులు డ్రైనేజీ కాల్వపైన మెట్టెలు(తాపలు) కట్టుకోవడం చిరు వ్యాపారస్తులకు బాడుగలకు ఇవ్వడం జరుగుతుంది. మరికొందరు చిరు వ్యాపారులు ఎ దేచగా రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉండటంతో ఉన్న రోడ్డు కాస్త ఆక్రమణ గురై కేవలం గతంలో మాదిరి సింగిల్ రోడ్డు గానే కనిపిస్తోంది. దీంతో బస్సులు గాని, లారీలు గాని వెళ్లేందుకు వాహన చోదకులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఏ వైపు వెళ్తే ఎటువైపు ఎవరు వచ్చి త? అర్థం కాని పరిస్థితి నెలకొంది .దీంతో పోరుమామిళ్లలో పాదచారులు సైతం అష్ట కష్టాలు పడుతున్నారు. ఉదయం పూట పాఠశాలలకు బడి పని దినాలు కావడంతో విద్యార్థులు అటూ ఇటూ రోడ్డు దాటుకుంటూ ఉంటారు ఈ ఆక్రమణల వల్ల వారికి చాలా ఇబ్బందిగా తయారైందని పలువురు అంటున్నారు. ఇది అంతా చూస్తూ ఉన్నా పోరుమామిళ్ల పోలీస్ అధికారులకు మాత్రం ఈ విషయం పై నామమాత్రమైన చర్యలు తీసుకుందామనే ధోరణి కలగకపోవడం ఎంతో శోచనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.చిరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించుకోవడమే కాకుండా.షాపుల యజమానులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీ బోర్డులు కూడా రోడ్డు కనిపించేందుకు తీవ్ర అడ్డంకిగా మారాయి. షాపుల ముందు రేకుల పందిర్లు వేసి రోడ్డును ఆక్రమించుకున్నప్పటికీ పోలీసులు చూస్తూ ఉన్నారు తప్ప చేసింది ఏమీ లేదంటున్నారు. ముఖ్యంగా స్టేట్ బ్యాంకు ,బస్ స్టాండ్, దేశాయి మహలు ,పాత సినిమా హాలు, లారీల బ్రోకరా ఆఫీస్, గాంధీ బొమ్మ ప్రాంతాలలో ప్రతినిత్యం అధికంగా జనసంచారం ఉంటుంది. అక్కడఈ చిరు వ్యాపారులు, షాపుల యజమానులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు చిరు వ్యాపారుల బండ్లు, తీవ్ర అడ్డంగా మారిపోయాయి. దీంతో ప్రజలు సైతం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. అడపా దడప పత్రికలలో వార్తలు వచ్చినప్పుడు పోలీసులు నామమాత్రంగా బజారుకు వచ్చి అక్కడ ఒకరిని.అక్కడ ఒకరిని. కానిస్టేబుల్ నునియమించి కంటిచూపు చర్యగా బండ్లు తొలగిస్తారు తప్ప శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. ముఖ్యంగా టీ హోటల్లు, టిఫిన్ సెంటర్ల వద్ద, చాపల మార్కెట్, చికెన్ మటన్ కోట్ల వద్ద, స్టేట్ బ్యాంకు ఎదురుగా చికెన్ షాప్ వద్ద ,టిఫిన్ పండ్ల దుకాణాల వద్ద ఇలా చెప్పుకుంటూ పోతే పోరుమామిళ్ల బజారు వెంబటి అన్ని అంగళ్ళ పేర్లు రాయవలసి వస్తుంది. కావున రద్దీగా ఉన్న చోటల్లా పోలీసులు జోక్యం చేసుకొని ట్రాఫిక్ క్లియర్ చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. పండగలు, పబ్బాలు వచ్చాయంటే చాపల మార్కెట్ ,చికెన్, మటన్ మార్కెట్ల వద్ద, కూరగాయల అంగళ్ల వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. దీంతో వాహన చోదకులు అష్ట కష్టాలు పడుతున్నారు. వీటన్నింటినీ తొలగించేందుకు పోలీసులకు వచ్చిన ఇబ్బందులు ఏమిటో ఆ పోలీస్ బాసులకే తెలియాలి.