prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 2:54 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వీరులపాడు మండల కేంద్రం జుజ్జురూ లో వెన్నుపోటుకు రెండేళ్ళు నిరసన కార్యక్రమం.

ఎన్టీఆర్ జిల్లా జూన్ 5 ప్రజావాణి నందిగామనియోజకవర్గం.వీరులపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల రమేష్, కోటేరు ముత్తారెడ్డి గార్ల ఆధ్వర్యంలో జుజ్జురూ గ్రామంలోని కూడలి లో కూటమి ప్రభుత్వం మేనిపెస్టో ప్రతులను దహనం చేసి నిరసన తెలియజేసారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.అమలకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను తెలుగుదేశం కూటమి నిలువునా మోసం చేశారని పేర్కొన్నారు.సూపర్ 6 హామీలతో ఓట్లు దండుకొని అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీలు చేసి తీరాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు షేక్ సహనాజీ బేగం, పూల రాంబాబు,షేక్ నాగులమీరా, ఇప్పల సత్యనారాయణ రెడ్డి,చలమల దుర్గారావు, పూల పుల్లారావు, ఆకుల అంజి, జమ్ముల వరబాబు,రత్నప్రసాద్,
వీరులపాడు మండల పార్టీ నాయకులు,కార్యకర్తలు,అనుబంధ విభాగాల నాయకులు పలువురు పాల్గొన్నారు.