వీరాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా పోచమ్మ బోనాల వేడుకలు

బెజ్జంకి, ఆగస్టు 7 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు. పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పాఠశాలలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి తహసీల్దార్ శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ చిలుముల సతీష్,...