వీరాపూర్‌లో పోలీస్ కళాభృందం అవగాహన కార్యక్రమం”-రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ప్రజలకు కీలక సూచనలు”

బెజ్జంకి, జూలై 26(ప్రజావాణి)  సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం, నేరాల నివారణకు అవసరమైన జాగ్రత్తలను తెలియజేయడం లక్ష్యంగా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరాపూర్ గ్రామంలో పోలీస్ కళాభృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన బెజ్జంకి ఎస్సై తిరుపతి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు,...