విశ్వనాథ్‌పూర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విశ్వనాథ్‌పూర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొందుర్గు మండల పరిధిలోని విశ్వనాథ్‌పూర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ సర్పంచ్ సుండు శ్రీలత రాములు జాతీయ జెండాను ఆవిష్కరించగా, ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ఎన్నో మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలు, ప్రజల సుదీర్ఘ పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన...