వివాహం నిశ్చయమైన యువతి అదృశ్యం
ఘట్‌కేసర్, జూన్ 29: వివాహం నిశ్చయమైన ఓ యువతి అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, సిరిసిల్ల జిల్లా పెద్ద బోనాల గ్రామానికి చెందిన భానోతు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే అదృశ్యమైన భానోతు వసంత (23) బోడుప్పల్‌లోని అభయ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తూ, తన సోదరి స్వప్నతో కలిసి ఘట్‌కేసర్ మండలం చౌదరిగూడ స్వర్ణగిరి కాలనీలో నివాసముంటోంది. ఇటీవల ఆమె వివాహం నిశ్చయమైన నేపథ్యంలో ఈ నెల 21న...