prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 8:09 pm Digital Edition : RRAJUREGONDA REGONDA

విలేకరుల సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

  • *విలేకరుల సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు...*

 

*సమస్యలపై మాట్లాడితే రాజకీయ బురద చల్లడం అవివేకం…*

 

*తప్పుడు ఆరోపణలు చెస్తే చెప్పు దెబ్బల పాలే…*

 

తేది:04.08.2026

భూపాలపల్లి

 

ఈ రోజు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వాక్యాలపై బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

 

*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…*

 

నిన్న మా ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

 

ఈ భూపాలపల్లి నియోజకవర్గం 2009లో ఏర్పడింది.గండ్ర వెంకట రమణా రెడ్డి గారు 2007–2009 వరకు ఎమ్మెల్సీగా, అనంతరం 2009–2014 మరియు 2018–2023 వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చిప్ విప్ గా ఈ ప్రాంతానికి సేవలందించారు. ఆయన హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి అనేక రంగాల్లో కృషి జరిగింది.

 

గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గండ్ర వెంకటరమణారెడ్డి గారు నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

 

ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని కస్తూర్బా, మైనారిటీ విద్యాలయాలను, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

 

మైనారిటీ పాఠశాలలకు సంబంధించి గతంలో విద్యార్థులకు వేర్వేరు భవనాల్లో మెరుగైన వసతులు కల్పించగా, ప్రస్తుతం మారిన ఏర్పాట్ల వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మా దృష్టికి వచ్చింది. తరగతి గదులు, హాస్టల్ సౌకర్యాలు, పరిశుభ్రత, పిచ్చి మొక్కల పెరుగుదల, విషసర్పాలు మరియు విషపురుగుల భయం వంటి సమస్యలు విద్యార్థుల భద్రతకు ఆందోళన కలిగిస్తున్నాయి.

 

ఈ విషయాలను ప్రజల దృష్టికి తీసుకురావడమే మా నాయకుడి ఉద్దేశం. దీనిని రాజకీయ కోణంలో చూడడం కాంగ్రెస్ నాయకుల అవిజ్ఞానానికి, వారి యొక్క అవగాహనా లేమికి నిదర్శనము అని ఏద్దేవా చేశారు.

 

అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా వైద్య సేవలు, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం వంటి అంశాలపై ఉన్న లోపాలను ఆయన ప్రస్తావించారు.

 

అక్కడ చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మీడియా ద్వారా ప్రజల ముందుకు, ప్రభుత్వాన్నికి తెలియచేశారు.

 

ఆసుపత్రిలో ఉన్న సమస్యలను ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, అయినప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో పరిష్కారం కనిపించలేదని తెలియజేశారు.

 

జిల్లా ఆసుపత్రిలో, మైనారిటీ స్కూల్లో అన్నీ సక్రమంగానే ఉన్నాయని కొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

 

వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే మాతో మీరు రండి మీడియా ప్రతినిధులతో కలిసి ఆసుపత్రిని సందర్శింద్దాం.

 

ఎవరూ రాజకీయం చేస్తున్నారు అనే విషయం ప్రజలకు తెలుస్తుంది అని అన్నారు.

 

అదేవిధంగా, మా నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం, నిర్ధారణలేని ఆరోపణలు చేయడంసరైంది కాదు.ఎవరిపైనా ఆరోపణలు చేస్తే వాటికి ఆధారాలు ఉండాలి.

 

ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన రాజకీయ సంస్కృతి కాదు.

 

కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

 

మీ నాయకులే ప్రస్తుత ఎమ్మెల్యే తిరుపతి లో హోటల్స్ కడుతున్నాడు అని, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొంటున్నాడు అని, బట్టల షాపుల్లో షేర్ ఉందని చెప్పుతున్నారు.

 

మా నాయకులపై ఇంకోసారి చెత్త మాటలు మాట్లాడితే మా బిఆర్ఎస్ కార్యకర్తల చేతులో చెప్పు దెబ్బల పాలు అవుతారు అని హెచ్చరించారు…….