రేగొండ : ఆ కారణంగా విలేకరులను దూషించిన భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య పై చర్యలు తీసుకుంటూ అతని పదవిని తొలగించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రేగొండ విలేకరుల సంఘం తీర్మానం చేయడం జరిగింది. శుక్రవారం రేగొండ మండలంలో కేద్రం లోని ప్రెస్ క్లబ్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పట్టెం కోటి మాట్లాడుతూ రేగొండ ఉమ్మడి మండలం లో వివిధ గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే హాజరు కావడం జరిగింది. రేపాక గ్రామంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే వార్త కవరేజ్ కోసం వెళ్ళిన విలేకరులపై మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్బుషలాడుతూ చిందులు వేశాడు. ఏం రాసుకుంటారో, రాసుకోండి అంటూ అనుచిత వాక్యాలు చేసి అవమానించాడు. ప్రజా సేవ చేస్తున్న విలేకరులపై ఉన్నత పదవిలో ఉండి దుర్భుశలాడం సిగ్గుచేటు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని కమిటీ తీర్మానం చేయడం జరిగింది. చైర్మన్ కిష్టయ్య పై చర్యలు తీసుకునేంతవరకు రేగొండ మండలంలో జరిగే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు రేగొండ విలేకర్లు ఎవరు వెళ్లకుండా నిరసన వ్యక్తం చేయడానికి సంఘం తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బండి సోమయ్య, ఉపాధ్యక్షులు బండి కమలాకర్,గౌరవ అధ్యక్షులు నామాల రమేష్, అంబాల రవీందర్, కోశాధికారి రహీమ్,కార్యవర్గసభ్యులు వి లేకరులు పాల్గొన్నారు