prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 8:21 am Digital Edition : RAJASHEKARREDDY

విరాపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహణ

విరాపూర్‌లో బడిబాట కార్యక్రమం నిర్వహణ

బెజ్జంకి మండలం, ఏప్రిల్ 15 (ప్రజావాణి):

 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని విరాపూర్ గ్రామంలో 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలుముల సతీష్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొనీ, గ్రామ ప్రజలకు విద్య ప్రాముఖ్యతను వివరించి, బడిఈడూ గల ప్రతి చిన్నారిని పాఠశాలకు పంపించాలని సూచించారు.బడిబాట కార్యక్రమం ద్వారా విద్యాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంటూ, గ్రామస్తులు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.