విబిజిరాంజీ క్షేత్ర సహాయకులకు మూడు నెలలుగా అందని జీతాలు
క్షేత్ర సహాయకుల సంఘం మండల అధ్యక్షులు ఎదురుగట్ల రాజేష్.
ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-
మూడు నెలలుగా ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు వేతనాలు అందడం లేదని క్షేత్ర సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్ర సహాయకులకు తక్షణమే జీతాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీడీవో విజయ్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకుల సంఘం మండల అధ్యక్షులు ఎదురుగట్ల రాజేష్,ఏపీవో అనిత,ఎంపీడీవో విజయ్ కుమార్ క్షేత్ర సహాయకులు కిరణ్,సంపత్,రాజయ్య, సంతోష్,స్వరూప,చంద్రకళ, సదానందం, దాసకిరణ్, కొమరయ్య,క్రాంతి పాల్గొన్నారు.