విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్.ఐ.ఓ ను సస్పెండ్ చేయాలి: ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్.
జూన్ 02 ప్రజావాణి కడప జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోకుండా వాటికి కొమ్ముకాస్తున్న ఇంటర్మీడియట్ ఆర్.ఐ.ఓ ను సస్పెండ్ చేయాలని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.సోమవారం ఏ.ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో ఆర్.ఐ.ఓ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ లో డి.ఆర్.ఓ కు పిర్యాదు చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన ఆర్.ఐ.ఓ పై జిల్లా అధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేయాలని...