prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 8:54 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్.ఐ.ఓ ను సస్పెండ్ చేయాలి: ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్.

జూన్ 02 ప్రజావాణి కడప జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోకుండా వాటికి కొమ్ముకాస్తున్న ఇంటర్మీడియట్ ఆర్.ఐ.ఓ ను సస్పెండ్ చేయాలని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.సోమవారం ఏ.ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో ఆర్.ఐ.ఓ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ లో డి.ఆర్.ఓ కు పిర్యాదు చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన ఆర్.ఐ.ఓ పై జిల్లా అధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా జూనియర్ కళాశాలలు కో-ఎడ్యుకేషన్ పేరుతో అనుమతులు తీసుకొని బాయ్స్, గర్ల్ క్యాంపస్ లు వేరు వేరుగా నడుపుతున్నారని, షిఫ్టింగ్ అనుమతులు లేకుండా కళాశాలలు నడుపుతున్న ఎలాంటి చర్యలు లేవన్నారు. కమర్షియల్ క్యాంపస్ మరియు ఒకే క్యాంపస్ లో రెండు మూడు విద్యాసంస్థలు నడుపుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా మాముళ్ళకు అలవాటు పడి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలలో తనకు అనుకూలమైన వారిని పరీక్షల విధులలో నియమించుకుని మాస్ కాపీయింగ్ కు పాల్పడుతూ అక్రమాలకు తెలిపారని వారు తెలిపారు. ప్రశ్నపత్రం మార్పు ఘటనలో ఆర్.ఐ.ఓ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుందని వారు తెలిపారు. విధినిర్వహణలో పూర్తిగా విఫలమై ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలకు అమ్ముడుపోయిన ఆర్.ఐ.ఓ ను వెంటనే విధులనుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రాలు చేపడతామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.బి నాయకులు అఖిల్ పాల్గొన్నారు.