విద్య కాదు వ్యాపారం,,పుస్తకం నుంచి బ్యాగ్ వరకు ప్రైవేట్ స్కూల్స్ దుకాణాలే,,ప్రైవేట్ స్కూల్స్ దోపిడీపై ప్రత్యేక కథనం

విద్య పేరుతో వ్యాపారం.చూస్తూ ఊరుకుంటున్న అధికార యంత్రాంగం?/ప్రజావాణి న్యూస్ (మే12) ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఒక పెద్ద సమస్యగా మారింది ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ.“పిల్లల భవిష్యత్తు అనే పేరుతో తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని అనేక ప్రాంతాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఒకప్పుడు స్కూల్ అంటే బోధన మాత్రమే.ఇప్పుడు స్కూల్ అంటే ప్యాకేజీ వ్యాపారం గా మారిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్కూల్ లోనే పుస్తకాల విక్రయంచాలా ప్రైవేట్ స్కూల్స్ బయట మార్కెట్‌లో దొరికే పుస్తకాలను కొననివ్వకుంతమ స్కూల్ లోనే ప్రత్యేకంగా పుస్తకాలు...