prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 8:02 am Digital Edition : PRAJA VANI

విద్యుత్ స్తంభాల పునరుద్ధరణలో సర్పంచ్ చొరవ<br>ప్రజా సమస్యల పరిష్కారామే మా నినాదం<br>గ్రామ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్.

విద్యుత్ స్తంభాల పునరుద్ధరణలో సర్పంచ్ చొరవ
-ప్రజా సమస్యల పరిష్కారామే మా నినాదం.
-గ్రామ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్.

రామగిరి, మన సమగ్ర ప్రజావాణి జూన్ 24

సుందిల్ల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బుధవారం ఉదయం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ,గ్రామస్థులతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొనడం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంటోంది.విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో ఏర్పడిన సమస్యను వెంటనే గుర్తించిన సర్పంచ్ నరేందర్ రెడ్డి, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్‌,సంబంధిత అధికారులతో సమన్వయం చేసి కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను చేపట్టారు.గ్రామ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావిస్తూ, క్షేత్రస్థాయిలో ఉండి పరిష్కార మార్గాలు చూపుతున్న గ్రామ నాయకత్వం ఆదర్శప్రాయమని గ్రామస్థులు పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచ్ నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకుల సేవా తత్వం అభినందనీయమని అలాగే విద్యుత్ శాఖ అధికారుల పనితీరుని వారు కొనియాడారు.