విద్యుత్ సరఫరా అంతరాయం
ఘట్‌కేసర్, జూలై 15: చెట్ల కొమ్మల కత్తిరింపు పనుల కారణంగా ఘట్‌కేసర్ సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రేపు (జూలై 16) విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ చందుపట్లగూడ ఫీడర్ పరిధిలోని చందుపట్లగూడ, ఎదులాబాద్, కొత్తగూడ, పోతురాజుగూడ, మర్రిపల్లిగూడ గ్రామాలు, శ్రీరామ పౌల్ట్రీ, ఒమేగా కళాశాల, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ ఎదులాబాద్ వ్యవసాయ ఫీడర్...