prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 8:44 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

విద్యుత్ సరఫరా అంతరాయం

ఘట్‌కేసర్, జూలై 31: 33 కేవీ ఇంటర్‌లింకింగ్ లైన్ పనులు, క్యాపిటల్ వర్క్స్ నిర్వహణ నేపథ్యంలో శనివారం (ఆగస్టు 1) నారపల్లి, పోచారం పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్ణీత సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజనీరు (ఆపరేషన్) తెలిపారు.

ఉదయం 10.30 గంటల నుంచి 11.00 వరకు కొర్రెముల, వెంకటాపూర్, మక్తా, తేనెగూడెం గ్రామాలు, 2 బీహెచ్‌కే కాలనీ, బాలాజీ నగర్, సదాత్‌అల్లిగూడ, సుప్రభాత్ టౌన్‌షిప్స్, ఓయూ కాలనీ, కొర్రెముల ఎక్స్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో…

మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 2.30 గంటల వరకు స్వర్ణగిరి కాలనీ, పీజీఎస్ కాలనీ, అరుంధతి కాలనీ, సీవీఎస్‌ఆర్ కళాశాల పరిసరాలు, హిమగిరి కాలనీ, జోడిమెట్ల ఎక్స్‌రోడ్డు…

మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 3.30 గంటల వరకు వెంకటాద్రి టౌన్‌షిప్, చౌదరిగూడ, విజయపురి కాలనీ, శివాజీ నగర్, ఓయూ కాలనీ, కొర్రెముల, వెంకటాపూర్, మక్తా, తేనెగూడెం గ్రామాల పరిధిలోని కాలనీలు, ఎల్లమ్మ కాలనీ, 2 బీహెచ్‌కే కాలనీ, బాలాజీ నగర్, సదాత్‌అల్లిగూడ, సుప్రభాత్ టౌన్‌షిప్స్ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.

పనులు పూర్తయ్యే వరకు వినియోగదారులు సహకరించాలని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.