విద్యుత్ సరఫరా అంతరాయం

పోచారం, జూలై 28 (ప్రజావాణి): సింగపూర్ టౌన్‌షిప్ సబ్‌స్టేషన్ నుంచి పోచారం సబ్‌స్టేషన్‌కు 33 కేవీ విద్యుత్ లైన్ అనుసంధానంలో భాగంగా 10 స్పాన్లలో స్ట్రింగింగ్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూలై 29 (బుధవారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెండు ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ తెలిపారు. సింగపూర్ ఫేజ్–1 ఫీడర్ పరిధిలోని సింగపూర్ టౌన్‌షిప్ డి–2, డి–3, డి–4, సి–1, సి–2, సి–3 బ్లాక్‌లు, అలాగే...