ఘట్‌కేసర్, జూలై 9: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణ కోసం చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ ఫీడర్ల నిర్వహణ పనులు చేపట్టనున్నందున జూలై 10 (శుక్రవారం) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ సగ్గు హరినాథ్ తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొర్రెముల గ్రామంలోని కాలనీలు, వెంకటాపూర్ గ్రామం, మక్తా గ్రామం, తేనెగూడెం, ఎల్లమ్మ కాలనీ, రెండు పడకగదుల గృహాల కాలనీ, బాలాజీనగర్, సాదాత్‌ల్లిగూడ, సుప్రభాత్ టౌన్‌షిప్,…. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వర్ణగిరి కాలనీ, పీజీఎస్ కాలనీ, అరుంధతి కాలనీ, సీవీఎస్‌ఆర్ కళాశాల పరిసరాలు, హిమగిరి కాలనీ, జోడిమెట్ల చౌరస్తా తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడనుంది.
విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.