ప్రజావాణి పత్రిక కథనానికి స్పంధన
సంఘటన స్థలానికి వెళ్లిన విద్యుత్ అధికారులు
బెజ్జంకి, ఏప్రిల్15(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యల కారణంగా ప్రజల్లో నెలకొన్న భయం, ఆగ్రహంపై విద్యుత్ అధికారులు స్పందించారు.గ్రామంలో సంఘటన స్థలాన్ని సందర్శించి సమస్యను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని ఏఈ, ఏడి అధికారులు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షులు సంగెం రూపేశ్ మాట్లాడుతూ ప్రజావాణి బెజ్జంకి మండల రిపోర్టర్ కేడిక రాజశేఖర్ రెడ్డికీ, అధికారులకు ఏడి సుధీర్ బాబు,ఎఈ మాహేష్ కృతజ్ఞతలు తెలిపారు.