విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి — ఏఈ మహేష్
బెజ్జంకి, జూలై 31 (ప్రజావాణి) వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెజ్జంకి విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) మహేష్ సూచించారు. ఇంట్లోకి వర్షపు నీరు చేరినప్పుడు లేదా గోడలు తడిసినప్పుడు విద్యుత్ స్విచ్‌లు, స్విచ్‌బోర్డులను తాకరాదని, తడి చేతులతో లేదా చెప్పులు లేకుండా విద్యుత్ పరికరాలను ఉపయోగించవద్దని తెలిపారు. ఇంట్లోకి నీరు చేరిన వెంటనే మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయాలని, పిడుగులు పడే సమయంలో టీవీ, కంప్యూటర్, రిఫ్రిజిరేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్‌లను...