విద్యుత్ ఘాతంతో యువరైతు మృతి
*బక్కమంతుల గూడెం, మఠంపల్లి మండలం*మఠంపల్లి మండలం *బక్కమంతుల గూడెం* గ్రామానికి చెందిన యువరైతు *నిమ్మల నరేష్ (29)* ఈ ఉదయం తన పొలం వద్దకు వెళ్లగా వర్షం కారణంగా కిందపడి డ్యామేజ్ ఐన విద్యుత్ తీగ ఫెన్సింగ్ తీగపై పడగా అట్టి పెన్సింగ్ తీగను పట్టుకున్న నరేష్ విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు