prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 9:50 am Digital Edition : PRAJA VANI

విద్యా వారోత్సవాల్లో జిల్లా స్థాయి ఉత్తమ ప్రతిభ అవార్డు పొందిన సిహెచ్. గణేష్ <br>

విద్యా వారోత్సవాల్లో జిల్లా స్థాయి ఉత్తమ ప్రతిభ అవార్డు పొందిన సిహెచ్. గణేష్

ప్రజావాణి
మే:16
కామారెడ్డి జిల్లా ప్రతినిధి :

మా పాఠశాలలో ఆర్ట్ & క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న
సిహెచ్. గణేష్‌కుమార్ గారు విద్యా వారోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.
యోగ భవనంలో నిర్వహించిన ఘన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి
(డి ఈ ఓ ) రాజు చేతుల మీదుగా ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేయబడింది.
విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసి, కళల పట్ల ఆసక్తి పెంపొందించడంలో గణేష్‌కుమార్  చూపిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించడం విశేషం.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ
సిహెచ్ .గణేష్‌కుమార్ కి అభినందనలు తెలిపారు.