విద్యార్థుల విజయం దేశానికి ఆదర్శం. యువత జోలికి రావద్దు – ముత్యాల ప్రసాద్ రావు, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి

పోరుమామిళ్ల జూలై 25 ప్రజావాణి నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిందని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాద్ రావు అన్నారు. సుమారు 35 రోజుల పాటు విద్యార్థులు, యువజన సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు శాంతియుతంగా నిర్వహించిన నిరసన ఉద్యమం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు.విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ఉద్యమ విజయంగా భావించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు....