విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలి — సీఐ విద్యాసాగర్
బెజ్జంకి,జూన్ 22 (ప్రజావాణి) అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా ఈగిల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "Say No To Drugs – Say Yes To Life" కార్యక్రమంలో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి అనుభంద గ్రామమైన ఎల్లంపల్లి మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్ధిపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చి. విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మాదక...