విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మపురి జూలై 10 (ప్రజావాణి): యువత చదువుకునే వయస్సులో డ్రగ్స్ జోలికి పోకుండా, మంచి మార్గంలో నడుస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. 'నశా ముక్త్ భారత్' కార్యక్రమంలో భాగంగా ధర్మపురి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన "మిషన్ పరివర్తన్" అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే ముఖ్యమంత్రి రేవంత్...