prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:42 am Digital Edition : PRAJA VANI

విద్యార్థులపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

*విద్యార్థులపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి…*

*నిరంకుశ వైఖరితో పాలన చేయలేరు.*

*సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.*

*జులై 29 యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి పెంట బాలరాజు మన ప్రజావాణి*

ఢిల్లీ విద్యార్థులపై లాఠీ చార్జ్ ప్రజా స్వామ్యం పై దాడి అని , ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని ఇలాంటి కక్ష సాధింపు చర్యలతో పరిపాలన చేయలేరని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధ వారం రోజు రాఘవేంద్ర కన్వెన్షన్ హాల్లో సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ ఇమ్రాన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ దేశ విద్యా వ్యవస్థలో పారదర్శకతను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం అందులో విఫల మైందని ఆరోపించారు. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవక తవకలు , ప్రశ్న పత్రాల లీకేజీలు లక్షలాది మంది విద్యార్థులు , వారి తల్లి దండ్రుల్లో తీవ్ర ఆందోళన కు కారణమయ్యాయని , ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత , జవాబు దారీతనం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఢిల్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతి యుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థుల పై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని సిగ్గుచేటు అన్నారు. ప్రజాస్వామ్యం లో నిరసన తెలిపే హక్కును అణచివేయడం సరైన పద్ధతి కాదని , విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందన్నారు. అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో చోటు చేసు కున్న చోరీ ఆరోపణల పై బిజెపి నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన ఈ అంశం పై పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి , బాధ్యుల పై కఠిన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. దేవాలయాల పేరుతో రాజకీయాలు చేసే వారు ఇలాంటి ఘటనల పై ఎందుకు మౌనం వహిస్తున్నారని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం , ధరల పెరుగుదల , ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ , కార్మికులు , రైతులు , విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 8 , 9 , 10 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో జరగనున్న అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యువత ప్రతినిధులు హాజరు కానున్న ఈ మహా సభల ను జిల్లా ప్రజలు , పార్టీ శ్రేణులు , యువత స్వాగతించి విజయ వంతం చేయాలని కోరారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం , విద్య , ఉపాధి , సామాజిక న్యాయం వంటి అంశాలపై ఈ మహాసభల్లో విస్తృతంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యా చరణ రూపొందించ నున్నట్లు తెలిపారు. ఈ
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి , జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్య నారాయణ , చేడే చంద్రయ్య , రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు , కురిమిద్ద శ్రీనివాస్ , జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ గౌడ్ , యేశాల అశోక్ నేత , పల్లెర్ల ఆంజ నేయులు  , ఇంజ హేమలత, వడ్లకొండ భారతమ్మ , అరే పుష్ప తదితరులు పాల్గొన్నారు.