విద్యార్థులతో హరితాహారం ర్యాలీతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన

హరితాహారం ర్యాలీతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన   రామచంద్రపురం ,జులై 8 (ప్రజావాణి) :హరితాహారం కార్యక్రమంలో భాగంగా చందానగర్‌లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం, పచ్చదనం విస్తరణ లక్ష్యంగా నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు హరితాహారం ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. చెట్లు ఆక్సిజన్‌ను అందించడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత కారణంగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులను...