prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 8:54 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: ఎంఈఓ పాపమ్మ

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: ఎంఈఓ పాపమ్మ

చెన్నారావుపేట జూలై 22 ప్రజావాణి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయడానికి చెన్నారావుపేట మండలశాఖ అధికారి మానుపాటి పాపమ్మ ప్రకటించారు. స్థానిక హైస్కూల్‌లో గత మూడు రోజులుగా సగం మంది ఎస్జీటీలకు వృత్తి నైపుణ్య శిక్షణ ముగింపు సభలో ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బోధనా పద్ధతులు, తరగతి నిర్వహణ, ఎఫ్‌ఎల్‌ఎన్‌పై అవగాహన కల్పించుకుని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థుల్లో ఆలోచనా తరగతి శక్తిని పెంపొందించేలా గది బోధన ఉండాలన్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్‌లైన్ పరీక్షను మొబైల్ యాప్ ద్వారా నిర్వహించాలని. కార్యక్రమంలో ఆర్పీలు నల్ల రవి, సునీత, విజయేందర్‌రావు, ఉపాధ్యాయులు, ఎంఆర్‌సీ సిబ్బంది ఉన్నారు.