prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 11:51 am Digital Edition : RAJASHEKARREDDY

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేసిన -ఎంపిడివో ప్రవీణ్

బెజ్జంకి, జూలై 13 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలను ఎంపీడీవో కడివేర్గు ప్రవీణ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు నులిపురుగుల నివారణ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ మాధురి, వైద్య సిబ్బంది, నర్సులు, ఆశా కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.