విద్యార్థి లోకం ఒత్తిడికి కేంద్రం లొంగుబాటు: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
న్యూఢిల్లీ :జూలై 25 ప్రజావాణి దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షల అక్రమాలు,పేపర్ లీకేజీల వ్యవహారం చివరకు కేంద్ర ప్రభుత్వంలో కీలక పరిణామానికి దారితీసింది.గత కొన్ని వారాలుగా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ దేశవ్యాప్తంగా విపక్షాలు,విద్యార్థి సంఘాలు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించింది.విద్యార్థి లోకం,ప్రజాసంఘాల నుంచి ఎదురైన తీవ్ర నిరసనల సెగతో చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా సమర్పించారు. మిన్నంటిన ఆందోళనలు – వెనక్కి తగ్గిన కేంద్రం నీట్ పేపర్ లీక్ అంశంపై...