విజయవాడ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి సీజ్… 8 మంది అరెస్టు

విజయవాడ ప్రజావాణిన్యూస్(మార్చి26)రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో ఈగల్ మరియు ఆర్‌పీఎఫ్ (RPF) సిబ్బంది సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు.రైలులోని ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయగా,సుమారు 65 కేజీల గంజాయి లభ్యమైంది. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈగల్ టీం సీఐ రవీంద్ర మాట్లాడుతూ.నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది,ఎక్కడికి తరలిస్తున్నారు అనే...