prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 1:01 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

విజయవాడ ధర్నా చౌక్ లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నిరాహార దీక్ష

ప్రజావాణి న్యూస్ :(మార్చి 09) విజయవాడ ధర్నా చౌక్ లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర నాగేశ్వరరావు,రాష్ట్ర అధ్యక్షులు విజయ ఉత్తరాది ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ పాల్గొని విద్యార్థి నాయకులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి బంగారు భవిష్యత్తు అందించాల్సిన విద్యార్థులు ఈరోజు కూటం ప్రభుత్వం తీరు వల్ల కనీస అవసరాలు లేకుండా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటినుండి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది అన్నారుఈ కూటమి ప్రభుత్వం బీసీ హాస్టల్స్ లోని విద్యార్థిని విద్యార్థులకు ప్రస్తుత అవసరాల దృశ్య కనీసం 150 రూపాయలు తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు విద్యార్థిని విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు తక్షణమే 500 రూపాయలకు పెంచాలని అన్నారు రాష్ట్రంలోని అన్ని బీసీ హాస్టల్స్ శాశ్వత భవనాలు కట్టాలని డిమాండ్ చేశారుగత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది అన్నారు ఈ కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు,శాసన మండలి సభ్యులు ఆటవిడుపు కార్యక్రమాలు పేరుతో విందు వినోదాలు సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో వికృత హాస్యం పండించడంలో బిజీగా ఉన్నారు గాని రాష్ట్రంలో ఉన్న బీసీ విద్యార్థిని విద్యార్థుల ఆకలి కేకలు వారికి వినబడటం లేదు తక్షణమే బీసీ సంక్షేమ శాఖ మంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షులు జవ్వా ది సుధీర్ తదితరులు పాల్గొన్నారు