prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 11:10 am Digital Edition : PRAJA VANI

విక్రమ్-1 రాకెట్ విజయంలో నిజామాబాద్ జిల్లా బిడ్డ సత్తా

విక్రమ్-1 రాకెట్ విజయంలో నిజామాబాద్ జిల్లా బిడ్డ సత్తా.

రాకెట్ బృందంలో కోటగిరి యువ ఇంజనీర్.

యువతకు స్ఫూర్తిగా గ్రామం నుంచి అంతరిక్షం వరకు.

కోటగిరికి చెందిన మహాజన్ అఖిల్ కీలక పాత్ర.

కోటగిరి/ప్రజావాణి:-భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1విజయంలో నిజామాబాద్ జిల్లా బిడ్డ కీలక పాత్ర పోషించారు.కోటగిరి మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ మహాజన్ విఠల్ కుమారుడు మహాజన్ అఖిల్ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.విక్రమ్ -1 రాకెట్ తయారీ,ప్రయోగంలో ఆయన సాంకేతిక బృందంలో భాగంగా ఉన్నారు. ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన అఖిల్ ఆరు సంవత్సరాల పాటు డిఆర్డిఓలో రీసెర్చ్ అసిస్టెంట్ గా సేవలందించారు.రక్షణ రంగంలో పొందిన అనుభవంతో ఆయన ప్రస్తుతం దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ కంపెనీలో ఇంజనీర్ గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.స్కైరూట్ ఏరోస్పేస్ తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు రూపొందించబడింది.ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ విజయం జిల్లా యువతకు స్ఫూర్తిగా నిలిచింది. కష్టపడితే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు అని ఆయన సొంతూరు ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు అఖిల్ విజయాన్ని అభినందిస్తున్నారు.