prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 6:59 am Digital Edition : PRAJA VANI

వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ

*వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ*

* *మన ప్రజావాణి*, మందమర్రి రూరల్:- జూలై 1

మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వికలాంగులకు సింగరేణి ఆధ్వర్యంలో ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. బుధవారం జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా జిఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామపంచాయతీ చెందిన పలువురు వికలాంగులకు ట్రై సైకిళ్లను గ్రామ సర్పంచ్ సెగ్యం వెంకటేష్, శ్రీరాంపూర్ ఏరియా జిఎం శ్రీనివాస్ లు అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగులు మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్ వెంకటేష్ చొరవతో తమకు ఉచితంగా ట్రై సైకిళ్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ ట్రై సైకిళ్లు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సెగ్యం వెంకటేష్, శ్రీరాంపూర్ ఏరియా జిఎం శ్రీనివాస్, సింగరేణి అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.