prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 9:45 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

విఐపి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌లో చేరిన ప్రముఖ న్యాయవాదులు

హైదరాబాద్ జూలై 08 ప్రజావాణి ప్రాంతీయంగా మానవ హక్కుల రక్షణ మరియు న్యాయపరమైన సహాయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ న్యాయవాదులు ఈరోజు ‘విఐపి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్’లో అధికారికంగా చేరారు.హైదరాబాద్‌లోని టోలిచౌకిలో గల అసోసియేషన్ ప్రధాన కార్యాలయం లో ఈ కార్యక్రమం జరిగింది. అసోసియేషన్ వ్యవస్థాపకులు,ప్రముఖ లాయర్ ఎండి జహంగీర్,మున్నా మరియు జాతీయ కార్యదర్శి షేక్ అహ్మద్ సమక్షంలో ఈ న్యాయవాదులందరికీ అధికారికంగా సభ్యత్వం కల్పించి,సంస్థలోకి ఆహ్వానించారు.అసోసియేషన్‌లో చేరిన ప్రముఖ న్యాయవాదులు:అడ్వకేట్ మౌనిక సమర్ల-అడ్వకేట్ గణేష్ కల్వకోలు-అడ్వకేట్ బొమ్మల శ్రవ్య -అడ్వకేట్ భార్గవి రేగు-అడ్వకేట్ నిహారిక ఎరువ ఈ సందర్భంగా టోలిచౌకి ప్రధాన కార్యాలయంలో వ్యవస్థాపకులు ఎండి జహంగీర్ మాట్లాడుతూ.అనుభవజ్ఞులైన న్యాయవాదులు తమ అసోసియేషన్‌లో చేరడం చాలా సంతోషకరమన్నారు.వీరి రాకతో సమాజంలోని వెనుకబడిన,బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో మరియు మానవ హక్కుల ఉల్లంఘనలపై పోరాడటంలో సంస్థ బలం మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.జాతీయ కార్యదర్శి షేక్ అహ్మద్ మాట్లాడుతూ.వివిధ ప్రాంతాల నుండి న్యాయ నిపుణులు అసోసియేషన్ వైపు మొగ్గు చూపడం, రాజ్యాంగ హక్కులు మరియు సామాజిక న్యాయం పట్ల సంస్థకు ఉన్న అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. విఐపి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆశయాల సాధన కోసం, తమ న్యాయ పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగిస్తామని ఈ సందర్భంగా నూతనంగా చేరిన న్యాయవాదులు స్పష్టం చేశారు