వాహన డీలర్లకు రవాణా శాఖ కీలక హెచ్చరిక

వాహన డీలర్లకు రవాణా శాఖ కీలక హెచ్చరికఅదనపు రుసుములు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలుపారదర్శక సేవలపై తిరుపతిలో అవగాహన సమావేశంతిరుపతి, జూలై 1 (ప్రజావాణి):వాహన కొనుగోలుదారులకు పారదర్శకమైన సేవలు అందించాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ వాహన డీలర్లకు స్పష్టం చేసింది. జిల్లా రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో డీలర్లకు కీలక సూచనలు జారీ చేశారు.వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రభుత్వ రుసుములు, పన్నులు, సేవా చార్జీల వివరాలను షోరూమ్‌లలో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములకు మించి...