prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 4:01 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి…-రాష్ డ్రైవింగ్ ప్రమాదకరం..-ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి..-మైనర్లు వాహనాలు నడపవద్దు..-గజ్వేల్ సిఐ రవికుమార్..

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి…-రాష్ డ్రైవింగ్ ప్రమాదకరం..-ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి..-మైనర్లు వాహనాలు నడపవద్దు..-గజ్వేల్ సిఐ రవికుమార్..

సిద్దిపేట జిల్లా, గజ్వేల్, మార్చి 9, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులు చదువుకునే పాఠశాలలు విద్యాలయాల వద్ద, పలువురు యువకులు ద్విచక్ర వాహనాలపై రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాద భరితంగా వివిధ భంగిమల్లో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ సోషల్.. మీడియాలో పోస్ట్ చేసిన పలువురు యువకులను ఉద్దేశించి వాళ్ల వీడియోలను సోమవారం వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో గజ్వేల్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్తలు పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన గజ్వేల్ సిఐ రవికుమార్, పోలీస్ బృందంతో వెళ్ళి రాష్, డ్రైవింగ్ చేస్తూ వీడియోలు తీసిన యువకులను వెంటనే అదుపులోకి తీసుకొని, వాళ్ల కి కౌన్సిలింగ్ ఇచ్చారు, ఈ సందర్భంగా సిఐ రవికుమార్ మాట్లాడుతూ… వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వళ్ళు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని, మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపితే, చట్టపరమైన చర్యలు చేపడతామని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని రోడ్డు నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు, కాగా ద్విచక్ర వాహనాన్ని రాష్ గా నడిపిస్తూ ప్రమాద… భరితంగా ఇతరులకు ఇబ్బంది పెట్టే విధంగా వీడియోలు తీసిన యువకులను వెంటనే పట్టుకొని వాళ్ల కు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టిన సీఐ రవికుమార్,కు పలువురు అభినందనలు తెలిపారు..